అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న హనీట్రాప్ కేసులో పోలీసులతో పాటు, వారి వెనుక ఉన్న రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఈ దందా సాగిందని ఆరోపించారు. ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.