సేంద్రియ ఎరువులు వాడండి, పంట మార్పిడి చేయండి

చెన్నై కొత్తపల్లి మండలంలోని ప్యాదిండి గ్రామంలో శుక్రవారం ఏడిఏ శైల కుమారి, వ్యవసాయ శాస్త్రవేత్త రామసుబ్బయ్య ఆధ్వర్యంలో రైతు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏడిఏ శైల కుమారి రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని, తద్వారా భూసారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్త రామసుబ్బయ్య పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల గురించి కూడా వివరించారు.

సంబంధిత పోస్ట్