రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలంలోని మేడాపురం గ్రామంలో సోమవారం రాత్రి గ్రామ దేవత పెద్దమ్మ తల్లి ఉత్సవ విగ్రహాం గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో అమ్మవారి కి వెండి కవచం తొడిగీ పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కాయ కార్పూరాలను సమర్పించుకున్నారు ఊరేగింపు అనంతరం అమ్మవారిని గ్రామ చావడి వద్ద ఉన్న అమ్మవారి ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.