అదనపు కట్నం వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్యాయత్నం

అనంతపురం రూరల్‌ ఆకుతోటపల్లిలో అదనపు కట్నం వేధింపుల కారణంగా ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చోటుచేసుకుంది. 2014లో రాప్తాడుకు చెందిన యమున వివాహం అనంతపురం చిన్నకుంటకు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్‌తో జరిగింది. తర్వాత భర్త, అత్తమామలు ఎకరం పొలం తీసుకురావాలని వేధించడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా మార్పు లేకపోవడం అలాగే పలుమార్లు బలవన్మరణానికి పాల్పడబోయింది. మల్లి వేధించడంతో సోమవారం పురుగుల మందు తాగింది. చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించారు.

సంబంధిత పోస్ట్