కుందుర్పిలో యువతి ఆత్మహత్య

కుందుర్పి మండలం నిజవల్లిలో శనివారం రేఖ అనే యువతి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై ఎస్ఐ మహేశ్ దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్