కనేకల్ మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యు రాష్ట్ర అధ్యక్షుడు కే. భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లెల ప్రసాద్ కోరారు. కమిషనర్ కళాశాలల డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా (ఐఏఎస్) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. డిగ్రీ కళాశాల కోసం విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తుండగా, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్తున్నారని అన్నారు.