అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలోని గోవిందవాడ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా జామ మొక్కల సాగు విజయవంతంగా చేపట్టబడింది అని కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థులకు ఉపాధి అవకాశాలు లభించడమే కాక, స్థానిక రైతుల వ్యవసాయ ఉత్పాదకత పెరిగేలా జామ సాగు కీలక పాత్ర పోషించింది అని కలెక్టర్ అన్నారు.