రాయదుర్గంలో దారుణం.. ఇంటిముందు బైక్‌కు నిప్పు

రాయదుర్గంలోని పార్వతీనగర్‌లో బుధవారం రాత్రి అనీఫ్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కింగ్ చేయగా, గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి నిప్పు పెట్టారు. దీంతో బైక్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. గురువారం ఉదయం ఈ ఘటనను గమనించిన బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులు భయాందోళన చెందుతుండగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్