డి. హీరేహాల్ మండలం మురడి శ్రీ ఆంజనేయస్వామి ఆలయ హుండీ కానుకలను సోమవారం లెక్కించారు. గత 9 నెలల కాలానికి రూ. 11,49,854 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో నరసింహరెడ్డి తెలిపారు. ఈ లెక్కింపు పర్యవేక్షణ అధికారి వి. దేవదాస్, ప్రజా ప్రతినిధులు, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో జరిగింది.