రాయదుర్గం వచ్చి.. తిరిగివెళుతూ..

ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని మొల కాల్మూరు రోడ్డు గాలిమారెమ్మ ఆలయం వద్ద, ప్రధాన రహదారి పక్కన ఆగి ఉన్న కారును ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం తుమకూర్ణహళ్లికి చెందిన నాగరాజు (40) తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. గురువారం వ్యక్తిగత పని నిమిత్తం రాయదుర్గం పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తుండగా రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్