డీ. హీరేహల్ మండలం మురుడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నీ టీడీపీ నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు.