హులికల్లు చెరువులో అక్రమ మట్టి తరలింపు: ప్రజల ఆగ్రహం!

డి.హిరేహాళ్ మండలంలోని హులికల్లు చెరువు నుంచి భారీ యంత్రాలు, టిప్పర్లతో గత రెండు రోజులుగా నిరంతరాయంగా అక్రమ మట్టి తరలింపు జరుగుతోందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సింధనూరు నాగరాజు ఆరోపించారు. రాయదుర్గం అధికార నాయకులు ఈ అక్రమాలకు కారణమని, కోట్లాది రూపాయల విలువైన మట్టిని తరలిస్తున్నారని ఆయన విమర్శించారు. మల్లికేతి, ఓబులాపురం, దొడగట్ట, మల్లాపురం, వేపరాళ్ళ చెరువుల నుంచి కూడా అక్రమ మట్టి తరలింపు జరుగుతోందని, రైతులను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్