జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు: మచ్చా

ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురంలోని మదన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రిలో రెండు రోజుల పాటు జరిగిన జర్నలిస్టుల ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మచ్చా రామలింగారెడ్డి మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని, నిర్లక్ష్యం ప్రమాదకరమని సూచించారు. యూనియన్ సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యంపై దృష్టి పెడతామని, అందరూ ఐక్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఏపీ జర్నలిస్టు డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో పరీక్షలు, డ్రాప్స్, మందులు ఉచితంగా అందించారు. రెండో విడతలో అద్దాలు, మూడో విడతలో ఆపరేషన్లు కూడా ఉచితంగా అందిస్తామని తెలిపారు. ఇది జర్నలిస్టులు, వారి కుటుంబాల ఆరోగ్యం కోసం చేపట్టిన ఒక ముఖ్యమైన కార్యక్రమం.

సంబంధిత పోస్ట్