ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 9 లక్షల చెక్కులను 36 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడం కూటమి ప్రభుత్వ బాధ్యత అని, రెండేళ్లలో నియోజకవర్గంలో 335 మందికి రూ. 2.33 కోట్ల సహాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల సంక్షేమం, పేదల పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని, ప్రతి కుటుంబానికి భరోసాగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు.