రాయదుర్గం పట్టణంలోని బస్‌స్టాండ్ వద్ద సూర్య సేవా సమితి సభ్యులు చలివెంద్రం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై దీనిని ప్రారంభించారు. సమాజంలో సూర్య సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు పసుపులేటి వెంకటేశులు, తాయిరాజ్ శేఖర్, బిసా శ్రీనివాసులు, ఊబేదుల్లా, బి. ఎన్. నరసింహులు పాల్గొన్నారు.