ఏరువాక పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాల్వ

గుమ్మఘట్ట మండలం పులకుంట గ్రామంలో ఏరువాక పౌర్ణమి వేడుకల్లో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆయన వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా నాగలితో దుక్కి దున్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అన్నదాతల కష్టానికి తగిన ఫలితం అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం సుభిక్షంగా సాగాలని, రైతు కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఏరువాక పౌర్ణమి రైతుల జీవితాల్లో ప్రత్యేకమైన పండుగ అని, భూమాతను, పశువులను, వ్యవసాయ పనిముట్లను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్