గుమ్మగట్ట మండలం తాళ్లకేర గ్రామంలో నిర్వహించిన మరెమ్మ దేవి జాతర ఉత్సవాల్లో ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ జాతర ఉత్సవాలు ప్రాంతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కలువ సన్నన్న, శ్రీరాములు, తలారి రాముడు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.