బెట్టింగ్ స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు

గుమ్మగట్ట మండలం పూలకుంట గ్రామంలో బెట్టింగ్ స్థావరంపై పోలీసులు గురువారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు. పక్కా సమాచారంతో ఎస్ఐ చిన్నరాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో 9 మంది బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 51,020 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్