రాయదుర్గం పట్టణంలో గురువారం మోస్తారు వర్షం కురిసింది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకోవడంతో గాలులతో కూడిన వర్షం కురిసింది. వర్షం వరదనీరు రోడ్ల పైకి చేరుకుంది. రానున్న 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.