రాయదుర్గంలో ఆదివారం, 11 ఏళ్ల కేఎండీ ఖుబీబ్ అనే బాలుడు 4 ఏళ్ల ఖురాన్ కోర్సును పూర్తి చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు. పట్టణంలోని మహమ్మదీయ అరబియా మదరసాలో చదువుతున్న ఈ బాలుడు, పెద్దలకు కూడా కష్టమైన ఈ కోర్సును కేవలం 4 ఏళ్లలో పూర్తి చేయడం విశేషం. మదరసా ప్రిన్సిపల్ అమీర్ హమ్లా, అధ్యాపకులు, పలువురు ముస్లిం మత పెద్దలు ఖుబీబ్ ను అభినందించారు.