గుమ్మఘట్ట మండలం రంగసముద్రంలో మంగళవారం అర్ధరాత్రి చిరుత దాడిలో 18 గొర్రెలు మృతి చెందాయి. మరో మూడు పిల్లలు, రెండు గొర్రెలు తీవ్ర గాయాలతో ఉన్నాయి. గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తన గొర్రెలను ఊరి శివారులోని పాకలో ఉంచాడు. అర్థరాత్రి దాటిన తర్వాత చిరుత పాకపై దాడి చేసి గొర్రెలను చంపేసింది. తెల్లవారుజామున అనిల్ గొర్రెలు నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.