రాయదుర్గం: నారుమడులను పరిశీలించిన వ్యవసాయాధికారులు

గుమ్మఘట్టలో నకిలీ విత్తనాలతో వరినారుమడులు సాగు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు వ్యవసాయాధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బీటీపీ ఎడమ కాలువ కింద సాగు చేసిన వరినారుమడులను వ్యవసాయశాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. వ్యవసాయ అధికారి నిర్మల్ కుమార్, విస్తరణాధికారి అంజనేయులు పంటపొలాలను సందర్శించి, వరినారు పరిశీలించారు. కొంతమంది రైతులు తాము నష్టపోయిన వరినారు పొలాలను చూపి తమ బాధను వెలిబుచ్చారు.

సంబంధిత పోస్ట్