రాయదుర్గం పట్టణంలోని ఇంటిలో చోరీ

రాయదుర్గం పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రైల్వే ఉద్యోగి నాగేంద్ర క్వార్టర్స్ కు సామాను తరలించి మిగిలిన సామాను పాత ఇంటిలో ఉంచి బీగాలు వేసుకొని వచ్చారు. అయితే గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి పెట్టెలో ఉంచిన నాలుగు తులాల బంగారు, 15తులాల వెండి నగలు, రూ. 2వేలు నగదును చోరీ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్