రాయదుర్గం నుంచి పొబ్బర్లపల్లి వరకు ఉన్న బడి బస్సులో డ్రైవర్ ఇతర ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాడని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని గ్రామీణ విద్యార్థులు వాపోయారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డిపో వద్ద నిరసనవ్యక్తం చేశారు. డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ బాస్ పాసులు తీసుకోని విద్యార్థులు రూ. 50, రూ. 100 నోట్లు ఇస్తే చిల్లర సరిగ్గా ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడన్నారు.