రాయదుర్గం: విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ఆందోళన

కొందరు బిల్లులు చెల్లించలేదని అధికారులు కణేకల్లు మండలం యర్రగుంట ఎస్సీ కాలనీకి విద్యుత్తు సరఫరా నిలిపివేయడంపై ప్రజలు బుధవారం ఆగ్రహంవ్యక్తం చేస్తున్నారు. అధికారులు తీరును నిరసిస్తూ కాలనీలో నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించని 63 ఇళ్ల లబ్ధిదారుల కోసం కాలనీలోని మొత్తం 400 ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం సరికాదన్నారు. కొంత మేర బిల్లులు చెల్లించినా సరఫరా పునరుద్ధరిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్