హెచ్చెల్సీకి తుంగభద్ర జలాలను నవంబరు ఆఖరి వరకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తుంగభద్ర డ్యాం ఎస్ఈఈ నారాయణనాయక్, ఎస్జీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. బొమ్మనహాళ్ సరిహద్దు వరకు హెచ్చెల్సీని సోమవారం వారు పరిశీలించారు. తుంగభద్ర జలాలను ఈ నెల 10న విడుదల చేసిన నేపథ్యంలో కాలువ స్థితిపై పరిశీలించినట్లు వారు తెలిపారు. తుంగభద్రకు ఇన్ ఫ్లో తగ్గిందన్నారు. ఆంధ్ర వాటా 18 టీఎంసీలు నీరు వస్తున్నట్లు తెలిపారు.