రాయదుర్గం: రాజు ముద్రతో కూడిన రైతు పాసు పుస్తకాలు పంపిణీ

కూటమి ప్రభుత్వం రైతులకు రాజముద్రలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేసింది. శుక్రవారం రాయదుర్గం మండలంలోని 74 ఉడేగోళం గ్రామంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కాలస శ్రీనివాసులు రైతులకు వీటిని అందజేశారు. వైసీపీ పాలనలో రీసర్వేల పేరుతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పట్టాదారు పాస్పుస్తకాలపై జగన్ ఫొటోలు ఉండేవని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ భూముల రీసర్వే చేసి, తప్పులను సరిదిద్ది, ప్రభుత్వ రాజముద్రలతో పట్టాదారు పాస్ పుస్తకాలను మంజూరు చేసిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్