ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు బుధవారం రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడుతూ, జిల్లాల పునర్విభజనపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మరని తెలిపారు. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని, కూటమి ప్రభుత్వానికి ప్రజాప్రయోజనాలే ప్రాధాన్యమని అన్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్విభజన పూర్తి చేశారని, అన్నమయ్య జిల్లాపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతం అర్థరహితమని, అన్నమయ్య పేరును తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు.