రాయదుర్గం: విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపును ఉపసంహరించాలి

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు స్మార్ట్ మీటర్ల బిగింపును వెంటనే ఉపసంహరించాలని కోరుతూ సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మల్లికార్జున, ఆ పార్టీ నాయకులు శనివారం రాయదుర్గం పట్టణంలోని వినాయక కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ నివాస గృహాల్లో కొత్తగా స్మార్ట్ మీటర్లను బిగిస్తే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు మధు, తిమ్మరాజు, ఓబులేషు, బాబు, సూరి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్