రాయదుర్గం: అప్పుల బాధతో రైతు బలవన్మరణం

కణేకల్లు మండలం తుంబిగనూరులో అప్పుల బాధతో పురుగు మందు తాగిన రైతు రామకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. రామకృష్ణ తనకున్న ఒక ఎకరాతోపాటు మరో 10ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఆయన భార్య ఎల్లమ్మ నాలుగేళ్ల కిందట అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం అప్పులు పెరిగిపోయాయి, పంటలు సక్రమంగా పండక మనస్తాపానికి గురైన రామకృష్ణ ఇంట్లో పురుగుమందు తాగి మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్