రాయదుర్గం: పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు ధర్నా

రాయదుర్గం మండలంలోని రాయంపల్లి సమీపంలో గవిసిద్ధేశ్వర స్టీల్ ప్లాంట్ నుంచి వెలువడే దుమ్ము, ధూళితో తమ పంటలు నష్టపోయాయని, పరిహారం అందించాలని ఆయతపల్లి, ఉడేగోళం, రాయంపల్లి రైతులు శుక్రవారం ఫ్యాక్టరీ వద్ద ధర్నా చేశారు. వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, టమోట వంటి పంటలు దెబ్బతిన్నాయని రైతులు వాపోయారు. ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చించి న్యాయం చేస్తామని ఎస్ఐ ప్రసాద్ బాబు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్