గురువారం సాయంత్రానికి గుమ్మఘట్ట బీటీపీ రిజర్వాయర్కు వరదనీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. గత నాలుగు రోజులుగా కర్ణాటకలో కురిసిన వర్షాల కారణంగా 4400 క్యూసెక్కుల నీటి ప్రవాహం బీటీపీకి చేరుతుండగా, నాలుగు గేట్లు ఎత్తి 3600 క్యూసెక్కులు దిగువకు వదిలారు. ప్రవాహం తగ్గడంతో రెండు గేట్లు దించి, రెండు గేట్ల ద్వారా 2000 క్యూసెక్కులు హగరికి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు.