రాయదుర్గం: ఘనంగా మాజీ ఎమ్మెల్యే చిన్నప్పరెడ్డి జయంతి

మాజీ ఎమ్మెల్యే చిన్నప్పరెడ్డి జయంతి వేడుకలను ఆదివారం కణేకల్లు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక చిక్కణేశ్వర ఆలయం వద్ద ఉన్న చిన్నప్పరెడ్డి విగ్రహానికి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు పూలమాలలు వేసి క్షీరాభిషేకం చేశారు. కణేకల్లు ప్రాంతానికి హెచ్చెల్సీ కాలువను తీసుకురావడంలో చిన్నప్పరెడ్డి పాత్ర ప్రముఖమైనదని వక్తలు కొనియాడారు. ఎమ్మెల్యే చిన్నప్పరెడ్డి అందరి మనస్సుల్లో గుర్తుండిపోయారన్నారు.

సంబంధిత పోస్ట్