రాయదుర్గం: కుక్కల దాడిలో మేకలు మృతి

గుమ్మఘట్ట మండలం కోనాపురానికి చెందిన ఓబుళేషుకు చెందిన 12 మేకలపై బుధవారం కుక్కలు దాడిచేసి చంపేశాయి. కొన్ని రోజులుగా స్థానికంగా ఉన్న కుక్కలు గొర్రెలు, మేకలను చంపుతున్నాయని ఆయన వాపోయారు. నిత్యం జీవాలు కాసుకొని బతికే తనకు సుమారు రూ. లక్ష నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్