బొమ్మనహళ్ మండలంలోని గోవిందవాడ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మేటి సిద్దేశ్వర, మేటి హనుమక్క దంపతులు నాలుగు రోజుల వ్యవధిలో మృతిచెందారు. భార్య మరణాన్ని తట్టుకోలేక సిద్దేశ్వర తీవ్ర ఆవేదనకు గురై అనారోగ్యం పాలయ్యాడు. బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. భార్య మరణించిన నాలుగు రోజులకే భర్త కూడా మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.