రాయదుర్గం మండలంలోని మల్లాపురం గ్రామంలో వెలిసిన విప్రమలై లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ గౌరవ ఆధ్యక్షుడు రామూర్తిస్వామీజీ ఆధ్వర్యంలో, ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్యస్వామి, హరిప్రసాద్ భరద్వజ్ పర్యవేక్షణలో స్వామి వారికి పంచామృతాభిషేకం, పుష్పాలంకరణ, నైవేద్య పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు దంపతులు రథాన్ని లాగి, స్వామి వారి దర్శనం చేసుకున్నారు. సీఐ జయనాయక్ బందోబస్తును పర్యవేక్షించారు.