హైకోర్టు న్యాయమూర్తులపై కొందరు పనిగట్టుకొని సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తుండటాన్ని నిరసిస్తూ రాయదుర్గం పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు వెంటనే చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం బార్ అసోషియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లేశప్ప, ఈసీ వన్నూరుస్వామి పాల్గొన్నారు.