రాయదుర్గం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఆదివారం బొమ్మనహళ్ మండలంలోని బండూరు గ్రామ శివారులో పాటిల్ ఉమాపతి అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో సెంట్రింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే ఉమాపతి, గత కొంతకాలంగా తన తమ్ముడు రాఘవేంద్రతో ఒక మహిళ విషయంలో గొడవ పడుతున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం గ్రామానికి వచ్చిన ఉమాపతి, గ్రామ సమీపంలోని రాఘవేంద్ర తోటలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు బొమ్మనహాళ్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్