రాయదుర్గం లో పట్టణంలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని బాల గంగాధర్ తిలక్ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేసింది అన్నారు.