రాయదుర్గం పట్టణంలోని వెలసిన ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం పురాతనంగా కొనసాగుతున్న ఆచారం నేటికి కొనసాగుతుంది. అరవ తెగకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక శ్రీ ధన్యకు శ్రీవారితో కళ్యాణం నిర్వహించారు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ పురోహితులు, ఈవో ఆధ్వర్యంలో కళ్యాణోత్సవాన్ని చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది.