రాయదుర్గం మండలంలోని వేపరాల చెరువు నుంచి ఎక్స్క వేటర్లు, టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని రైతులు, టీడీపీ నాయకులు అధికారులకు సమాచారం అందించారు. తహసీల్దార్ నాగరాజు, ఇరిగేషన్ డీఈ గీతాలక్ష్మి శుక్రవారం చెరువు వద్దకు చేరుకుని పరిశీలించారు. గత కొద్దిరోజుల్లో 2,540 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించారని, ప్రస్తుతం 650 క్యూబిక్ మీటర్ల మట్టి తరలిస్తున్నారని గుర్తించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు.