రాయదుర్గం: కుక్కల బెడదతో-వీధుల్లో రావడానికి జంకుతున్న ప్రజలు

కణేకల్లు మండల కేంద్రంలో వారం రోజుల్లో కుక్కల సంఖ్య భారీగా పెరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వాహనాల్లో తీసుకొచ్చిన కుక్కలను కణేకల్లు సమీపంలో వదిలివేయడంతో అవి మండల కేంద్రంలోకి ప్రవేశిస్తున్నాయి. ఇటీవల ఇద్దరు వ్యక్తులపై, బుధవారం మరో వ్యక్తిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రజలు వీధుల్లోకి రావడానికి జంకుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి ఈ కుక్కల బెడద నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్