శెట్టూరు మండలం మాకొడికి గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఖాసీం సాబ్, తాను చదువుకున్న ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం తన నెల జీతం రూ. 45 వేలను గురువారం విరాళంగా అందజేశారు. రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఆయన సొంత ఊరిపై మమకారంతో చేసిన ఈ సాయాన్ని గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.