రాయదుర్గం: గర్భిణి తీవ్ర రక్తస్రావంతో మృతి

కణేకల్లు మండలంలోని మాల్యం గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ గంగమ్మ అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందింది. తీవ్ర కడుపునొప్పితో కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆసుపత్రికి వెళ్లగా, మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. గర్భంలోనే బిడ్డ చనిపోవడంతో వైద్యులు అబార్షన్ చేయగా, గంగమ్మకు తీవ్ర రక్తస్రావం జరిగి మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్