రాయదుర్గం: వేళకు బస్సుల్లేవని విద్యార్థుల ధర్నా

బొమ్మనహళ్ మండలంలోని ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం, బళ్లారి రాహదారిపై మంగళవారం కళాశాల, హైస్కూల్ విద్యార్థులు ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆర్టీసీ బస్సులు వేళకు నడపడం లేదని ధర్నా నిర్వహించారు. ఉదయం, సాయంత్ర సమయాల్లో బస్సులు లేకపోవడంతో విద్యా సంస్థలకు, ఇళ్లకు ఆలస్యంగా వెళ్తున్నామని విద్యార్థులు వాపోయారు. దాదాపు గంట సేపు జరిగిన ఈ ధర్నా వల్ల ట్రాఫిక్ స్తంభించింది. బస్సులు సమయానికి వచ్చేలా అధికారులతో మాట్లాడతామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు నాగవేణి, శివ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్