ఆషాఢ మాసం సోమవారం సందర్భంగా రాయదుర్గం పట్టణం కోటలో ఉన్న శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకుడు రామకృష్ణ స్వామి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఏకబిల రుద్రాభిషేకం చేయగా, స్వామివారిని పుష్పాలతో అలంకరించి మంగళ నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు శివనామస్మరణతో తన్మయత్వంలో మునిగిపోయారు.