బొమ్మనహాళ్ మండలంలోని ఉద్దేహాళ్ గ్రామంలో శనివారం కొందరు ఆకతాయిలు చెత్తకు నిప్పు పెట్టడంతో రెండు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో లక్ష్మణకు చెందిన ఖాళీ చెక్క బంకు పూర్తిగా కాలిపోయి సుమారు రూ. 50వేల నష్టం వాటిల్లింది. హరీష్ కు చెందిన సెలూన్ షాప్లో రూ. 10వేల విలువైన కుర్చీ, పరికరాలు కాలిపోయాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, హైస్కూల్ వద్ద రోడ్డు పక్కన ఉన్న దుకాణాల వెనుక చెత్త ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది.