బైరవానితిప్ప ప్రాజెక్టులో ప్రమాదవశాత్తు నీటమునిగి మన్సూర్ బాష, జబివుల్లా దుర్మ రణం చెందిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. రాంపురానికి చెందిన జబివుల్లా తన బందువు మన్సూర్ బాషతో కలసి ద్విచక్ర వాహనంపై బీటీ ప్రాజెక్టుకు చూడటానికి వెళ్లారు. సాయంత్రం ఎడమ కాలువ గేట్ వద్ద చేపలు పట్టే ప్రయత్నాలు చేశారు. వారికి ఈత రాకపోవటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయి మృతిచెందారన్నారు. పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.