రాయదుర్గం: బైక్ బోల్తా పడి ఇద్దరికి తీవ్ర గాయాలు

గుమ్మఘట్ట మండలం బేలోడు గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు అయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గం తీటకల్లు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రాయదుర్గం వైపు బైక్ పై వెళ్తుండగా ఈదురు గాలులు వేగంగా వీయడంతో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రి తరలించారు.

సంబంధిత పోస్ట్