డి. హీరేహాళ్ మండలం సోమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సోమవారం అర్ధరాత్రి లభ్యమయింది. రైల్వే జిఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రైలుపట్టాల మధ్య గుర్తు తెలియని శవం రెండు భాగాలుగా పడి ఉన్నట్లు తెలిపారు. మృతునికి సుమారు 30సంవత్సరాలు ఉండవచ్చన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.